17-09-2025 10:02:07 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో బుధవారం బెల్లంపల్లి మండల విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం సభ్యులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ చేశారు. మహా నైవేద్యం, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ అనంతరం అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం నాయకులు మాట్లాడుతూ... సకల వేదాల ప్రకారం విశ్వకర్మ సృష్టికర్త అని, తన కళా నైపుణ్యం ద్వారా భారత దేశ విశిష్టతను ప్రపంచానికే చాటి చెప్పిన గొప్ప రూపకర్త అని పేర్కొన్నారు. విశ్వబ్రాహ్మణ కులస్తులందరూ ఐకమత్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని కోరారు.