calender_icon.png 6 September, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడల అభివృద్ధికి నిధులివ్వండి

06-09-2025 12:37:35 AM

  1. ఖేల్ ఇండియా 8వ ఎడిషన్‌ను తెలంగాణకు కేటాయించండి 
  2. కేంద్ర క్రీడా శాఖ మంత్రికి రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి వినతి
  3. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన రాష్ట్ర మంత్రి

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): ఖేల్ ఇండియా 8వ ఎడి షన్‌ను తెలంగాణకు కేటాయించాలని, క్రీడల అభివృద్ధ్దికి నిధులు కేటా యించాలని కేంద్ర క్రీడా శాఖ మం త్రి మన్‌సుఖ్ మాండవీయను రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని మాండవీయను రాష్ట్ర మంత్రి శ్రీహరి కలిసి వినతిపత్రం అందజేశారు. వచ్చే ఏ డాది నిర్వహించే  ఖేల్ ఇండియా క్రీడలను తెలంగాణలో నిర్వహించాలని కోరారు.

అంతే కాకుండా రా ష్ట్రంలోని హకీంపేట, ఆదిలాబాద్ , కరీంనగర్, వనపర్తి సహా వివిధ జి ల్లాలలో క్రీడా పాఠశాలల అభివృద్ధ్దికి నిధులు కేటాయించాలని కోరినట్లు మంత్రి శ్రీహరి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్రీడలకు అమి తప్రాముఖ్యతను ఇస్తూ క్రీడా పాలసీని తీసుకొచ్చారని తెలిపారు.

స్టేడి యాలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని, అందుకు అ నుగుణంగా స్పోర్ట్స్ పాలసీని రూ పొందిస్తున్న అంశాన్ని కేంద్ర మం త్రికి వివరించగా, సానుకూలంగా స్పందించారని మంత్రి శ్రీహరి చెప్పారు. మంత్రి వెంట రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఢిల్లీలోని ప్రభు త్వ సల హాదారు జితేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.