calender_icon.png 6 September, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్కింగ్ లేని హాస్పిటల్స్!

06-09-2025 12:03:03 AM

  1. సెట్ బ్యాక్ స్థలమూ ఆక్రమణ 

ఆ ప్లేసులో జనరేటర్లు ఏర్పాటు

రోడ్లపైనే వాహనాల పార్కింగ్

అంబులెన్స్ వచ్చినా ఆగమే

మామూళ్ల మత్తులోఅధికారులు

సిద్దిపేట, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి):పేషెంట్లకు మాత్రమే రూల్స్, ప్రైవేట్ ఆ స్పత్రుల నిర్వహణకు మాత్రం రూల్స్ ఉం డవు సిద్దిపేటలోని ప్రైవేటు ఆస్పత్రుల నిజ పరిస్థితి. రోగులకు ఆరోగ్య నియమాలు చెప్పే వైద్యులు, వారు నడుపుతున్న ఆస్పత్రులకు మాత్రం ప్రాథమిక నిబంధనలు పట్టించుకోవడంలేదు. పార్కింగ్ లేని భవనాలు, సెట్బ్యాక్ స్థలంలో నిర్మాణాలు, అం బులెన్స్కి దారి లేకుండా బిగుసుకుపోయిన వీధులు, ఇవే ఇప్పుడు సిద్దిపేట పట్టణ ప్రైవే టు ఆస్పత్రుల జోనులోని అసలు చిత్రాలు.

అధికారుల మామూలు మత్తు... 

ఆసుపత్రుల ఏర్పాటుకు పట్టణ ప్రణాళిక ప్రకారం అనేక నిబంధనలు తప్పనిసరి. కనీసం 40 అడుగుల రోడ్డు ఉండాలి, తగిన పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలి, సెట్బ్యాక్లో ఇతర నిర్మాణాలు చేయరాదు. కానీ సిద్దిపేటలోని ప్రైవేటు ఆస్పత్రుల యా జమాన్యాలు వీటిని బేఖాతరు చేస్తుంటే, అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో కళ్లుమూసి కూర్చున్నారు. ని బంధనలు ఉల్లంఘించిన భవనాలకు అనుమతులు జా రీ కావడం వెనక అంతర్గత డీల్ ఉంటుందని స్థానికులు గుసగుసలాడుతున్నారు.

సంకుచిత వీధుల్లో ఆస్పత్రులు..

మూడు అంతస్తుల కంటే ఎక్కువ భవనాలు నిర్మించాలంటే ప్రత్యేక అనుమతులు అవసరం. కానీ సిద్దిపేటలో ఇరుకైన వీధుల్లోనే నాలుగు, ఐదు అంతస్తుల ఆసుపత్రు లు చెల్లాచెదురుగా పెరిగిపోతున్నాయి. పా ర్కింగ్ లేని ఈ భవనాల్లో వాహనాలు రోడ్డుపైనే నిలిపివేయడంతో రెండు వైపులా ట్రా ఫిక్ జామ్ సమస్య తలెత్తుతుంది.

సెట్బ్యాక్లు సొంత ఆస్తులా...

నిబంధన ప్రకారం సె ట్బ్యాక్ స్థలం అత్యవసర అవసరాల కోసం ఖాళీగా ఉండా లి. కానీ సిద్దిపేట ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు ఆ స్థలా న్ని ప్రైవేట్ ప్రాపర్టీగా వాడేస్తున్నా రు. స్వేచ్ఛ ఆసుపత్రి భవనంలో సెట్బ్యాక్లో భారీ జనరేటర్ ఏర్పాటు చేశారు. పక్కనే ఉ న్న లక్ష్మీనరసింహ ఆసుపత్రి భవనంలో అదే స్థలంలో మెట్లు నిర్మించారనీ దాంతో అ క్కడకు వచ్చే పేషెంట్లు రోడ్డుపైనే వాహనా లు నిలిపివేయాల్సి వస్తోంది.

ఫలితంగా ఇ ప్పటికే ఇరుకైన రోడ్లలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభిస్తోంది. స్థానికంగా నివాసం ఉండే వా రికి అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. ఈ విషయంపై పలుమా ర్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసి న స్పందించడం లేదంటూ మండిపడుతున్నారు.

ఆస్పత్రుల జోన్ రోడ్లు గజిబిజి... 

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీ రు హరీష్ రావు నివాసానికి వెళుతున్న రో డ్డుపై ఈ ఆసుపత్రులే ఉన్నాయన్నది ప్రత్యే క అంశం. ప్రజా ప్రతినిధి ఇంటికి వెళ్ళే రో డ్డే ఇంత దారుణంగా ఉంటే మిగతా రో డ్ల పరిస్థితి ఏంటో చెప్పకనే అర్థమవుతుంది.

స్థానికుల డిమాండ్

‘ప్రైవేట్ ఆసుపత్రులు డబ్బు కోసం రూల్స్ తుంచుతుంటే, అధికారులు మా మూళ్ల కోసం మూలుగుతున్నారు. ఇకనై నా మున్సిపల్ అధికారులు మేల్కొని చర్య లు తీసుకోవాలనీ, ఆసుపత్రుల వద్ద తగిన పార్కింగ్ ఏర్పాట్లు తప్పనిసరి చేయాలనీ, నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డి మాండ్ చేస్తున్నారు.

అంబులెన్స్కే దారి లేదు...

ఒక్కో ఆసుపత్రి ముందు రోడ్డుపైన వా హనాల క్యూలు కనిపిస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ చేరుకోవడమే కష్టమైపోతోంది. ప్రాణాల కోసం పోరాడుతు న్న రోగి అంబులెన్స్లో ఉన్నా, ఆసుపత్రి గే టు దాకా తీసుకురావడం ఒక యుద్ధమే అ వుతోంది.