7 August, 2026 | 2:29 AM

గ్రామాభివృద్ధికి నిధులివ్వండి

07-08-2026 12:00 AM

మంత్రి దామోదరకు వినతి 

మహేశ్వరం, ఆగస్టు 6 (విజయక్రాంతి): మండలంలోని కోళ్లపడకల్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కాంగ్రె స్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ నందిగామ నరసింహ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే మంత్రిని క లిసి విన్నవించినట్లు తెలిపారు. సీఎం రేవం త్ నాయకత్వంలో ప్రభుత్వం అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు.