05-07-2025 07:29:55 PM
జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు..
సూర్యాపేట (విజయక్రాంతి): విద్యార్థులకి మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు(District Additional Collector P Rambabu) తెలిపారు. శనివారం సూర్యాపేట మండలం బాలేంలలోని సోషల్ వెల్పేర్ రెసిడెన్సియల్ స్కూల్, ఇంటర్, డిగ్రీ కాలేజీలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన బియ్యం నాణ్యత పరిశీలించారు. అలాగే స్టాక్ వివరాలు, కూరగాయలు, వంట సామాగ్రి పరిశీలించారు. వంట గదుల నందు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈయన వెంట ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది ఉన్నారు.