05-07-2025 07:30:03 PM
కాగజ్ నగర్(విజయక్రాంతి): సిర్పూర్ నియోజకవర్గం లోని పలు సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్సీ దండె విఠల్ శనివారం హైదరాబాద్ లో మంత్రులను కలిశారు. సిర్పూర్ టి మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గంలో నిరుద్యోగుల కోసం స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్క ను కోరారు. వీటితోపాటు నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లగా వాటి పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్సీ తెలిపారు.