01-12-2024 12:15:14 PM
గుంతల మయమైన రోడ్డుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము
ఆర్జీ-3 జిఎం సుధాకర్ రావును కోరిన రచ్చపల్లి గ్రామస్తులు
మంథని (విజయక్రాంతి): మంథని మండలంలోని సింగరేణి నిర్వాసితుల గ్రామమైన రచ్చపల్లి, అక్కపల్లి తదితర గ్రామాల ప్రజలు, మంథని పట్టణం నుంచి గ్రామానికి పోవాలంటే, గుంతల మాయమైన రోడ్డుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రోడ్డు కు మరమత్తులు చేసి వేంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆర్జీ-3 జిఎం సుధాకర్ రావును రచ్చపల్లి గ్రామస్తులు కోరారు. జీఎం కార్యాలయంలో పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జనగామ నర్సింగరావు, మాజీ వార్డు సభ్యులు సల్పాల మల్లేష్ యాదవ్, గ్రామ రామాలయ కమిటీ చైర్మన్ సాదుల సజయ్, ప్రధాన కార్యదర్శి నామిని రాజు తదితరులు జిఎం సుధాకర్ కు గ్రామ సమస్యలు వివరించారు. సానుకూలంగా స్పందించిన సీఎం గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు.