09-09-2025 11:49:43 PM
గుర్రు మన రాజకీయ పార్టీలు.
చర్ల (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో గల ఉంజుపల్లి మిషన్ భగీరథ సంపు ఘటనలో మంగళవారం ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ముగ్గురు మృతులలో ఉంజుపల్లకి చెందిన కాక మహేష్ మృతి పట్ల గ్రామస్తులు కాక మహేష్ కుటుంబానికి సదరు సంపు నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆందోళనకు దిగారు. సీఐ రాజు వర్మ న్యాయం చేసే దిశగా బాధితులతో మాట్లాడుతున్న క్రమంలో చర్ల మండలానికి చెందిన ఒక వ్యక్తి బాధితుల కుటుంబానికి న్యాయం చేయాలంటూ దుర్భాషలాడడంతో అది విన్న సీఐ రాజు వర్మ శాంతి భద్రతలు పరిరక్షించే దిశగా దుర్భా షలాడుతూ, రెచ్చగొట్టే వివాదాలు చేస్తున్నావంటూ ఒక్కసారిగా చంప చల్ మనిపించారు. దీంతో సమస్య కొంత సద్దుమణిగినప్పటికీ బహిరంగంగా ఒక వ్యక్తిపై చేయి చూసుకోవడం పట్ల కొన్నీ రాజకీయ పార్టీలు గుర్రు మంటున్నాయి.