25-07-2025 07:27:23 PM
నిర్మల్,(విజయక్రాంతి): విద్యా ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారానికి పిఆర్టియు కృషి చేస్తుందని అర్బన్ అధ్యక్షులు బల్స గజ్జరం ప్రధాన కార్యదర్శి స్వామి అన్నారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. టీఎస్ పీఆర్డీయు సంఘం విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేసిందని ఆ సంఘంలో సభ్యత్వం చేసుకోవడం బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజమౌళి సంఘం నాయకులు మునిందర్ రాజు తదితరులు పాల్గొన్నారు