calender_icon.png 26 July, 2025 | 1:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లావ్యాప్తంగా ఎరువుల షాపుల్లో తనిఖీలు

25-07-2025 07:24:24 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎరువుల షాపుల్లో శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. యూరియా కృత్రిమ కొరత, అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ వ్యవసాయ శాఖ అధికారులను జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 18 మండలాల పరిధిలో ఉన్న ఎరువుల షాపులను వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. షాపుల్లో ఎరువుల స్టాక్ వివరాలను, రికార్డులను, గోదాములను తనిఖీ చేశారు. ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని, కృత్రిమ కొరత సృష్టి సహించేది లేదని హెచ్చరించారు. ఎరువులను ఈపాస్ యంత్రం ద్వారా రైతులకు విక్రయించాలని, ఎప్పటికప్పుడు స్టాక్ వివరాలను బోర్డుపై నమోదు చేయాలని ఆదేశించారు.