09-02-2025 06:15:36 PM
నిర్మల్ (విజయక్రాంతి): విద్యా ఉపాధ్యాయ రంగాల సమస్యల పరిష్కారం కోసం పిఆర్టియు అనేక పోరాటాలు నిర్వహించి ఎన్నో విజయాలు సాధించిందని పిఆర్టియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరేంద్రబాబు రమణ రావులు అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని పిఆర్టియు భవన్లో పిఆర్టియు ఆయుర్వా దినోత్సవాన్ని జరుపుకొని జండా ఎగరవేశారు. 1971లో సంఘం ఏర్పడి ఐదు దశాబ్దాలుగా ఉపాధ్యాయులు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.