15-09-2025 12:47:16 AM
జాయింట్ సెక్రటరీగా అబ్దుల్లా కొనసాగింపు
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): ఉపాధ్యాయ సంఘాలన్నిటినీ ఒక్కొక్కటిగా చీల్చుకుంటూ పోతుంటే గుర్తింపునివ్వలేమని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్ (ఏఐఎఫ్‌టీవో) జాతీయ ప్రధాన కార్యదర్శి సీఎల్ రోజ్ స్పష్టం చేశారు. అయితే మన్నె చంద్రయ్య రాష్ట్ర అధ్యక్షుడిగా, మహమ్మద్ అబ్దుల్లా ప్రధానకార్యదర్శిగా కొనసాగుతున్న పీఆర్టీయూ తెలంగాణకు ఒరిజినల్ సంఘంగా గుర్తింపునిచ్చినట్లు ఆదివారం ఒక ప్రకటనలో వారు తెలిపారు.
రాష్ట్ర ప్రధానకార్యదర్శి మహమ్మద్ అబ్దుల్లాను ఏఐఎఫ్‌టీవో జాయింట్ సెక్రటరీగా కొనసాగిస్తున్నట్లు, మెయిల్ ద్వారా గుర్తింపు లేఖను పోస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో సంఘాలు స్థాపించుకునే అధికారం అందరికీ ఉంటుందని మన్నె చంద్రయ్య, మహమ్మద్ అబ్దుల్లా ఈమేరకు పేర్కొన్నారు.