calender_icon.png 15 September, 2025 | 9:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత పెన్షన్ అమలు చేసే పార్టీలకే మా ఓటు

15-09-2025 12:47:27 AM

ఎన్‌ఎంఓపీఎస్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ

పాట్నా పెన్షన్ సంఘర్ష్ సభలో ఓట్ ఫర్ ఓపీఎస్ ప్రతిజ్ఞ

హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): పాత పెన్షన్ అమలు చేసే పార్టీలకే తాము ఓటు వేస్తామని నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ స్పష్టం చేశారు. నవంబర్‌లో ఎన్నికల దృష్ట్యా బీహార్ రాష్ర్ట రాజధాని పాట్నాలోని మిల్లర్ హై స్కూల్ గ్రౌండ్‌లో ఆదివారం నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ ఆధ్వర్యంలో పెన్షన్ సంఘర్ష్ భారీ బహిరంగ సభ నిర్వహించింది.

ఈ సందర్భంగా సెక్రెటరీ జనరల్ స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ... ఇటీవల దేశంలోని పలు పార్టీలు తమ మేనిఫెస్టోలో సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ అమలు చేస్తామని ప్రకటించాయని తెలిపారు. అలాగే తెలంగాణ, కర్ణాటకలో సీపీఎస్ ఉద్యోగుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చాయని తెలిపారు. ఇప్పుడు బీహార్‌లో జరిగే ఎన్నికల్లోనూ పాత పెన్షన్ అమలు చేసే పార్టీలకే సీపీఎస్ ఉద్యోగులు మద్దతిస్తారన్నారు. అనంతరం ‘పాత పెన్షన్ అమలు చేసే పార్టీకే మా ఓటు’ అని ఓట్ ఫర్ ఓపీఎస్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సభలో ఎన్.ఎం.ఓ.పీఎస్ ప్రతినిధులు విజయ్ బంధు, ఝార్ఖండ్ అధ్యక్షుడు విక్రాంత్, తెలంగాణ రాష్ర్ట సీపీఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, ఎంపీ రాజా రాం సింగ్, సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.