calender_icon.png 15 September, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేడుకలకు అద్భుత వేదిక.. తెలంగాణ

15-09-2025 12:45:35 AM

-రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం

-మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి) : వివాహ వేడుకలకు తెలంగాణ అద్భుత వేదిక అని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అక్షయ కన్వెన్షన్‌లో పర్యాటక శాఖ సహకారంతో తెలంగాణ చాంంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన నాల్గవ సౌత్ ఇండియా వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్‌లో మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

తెలంగాణలో పురాతన కోటలు, రాజమహాళ్లు, దట్టమైన అడవులు, నదులు సరస్సులు, కొండలు, ఆధునిక విలాసవంతమైన హోటళ్లు.. తదితర సంపద ప్రపంచ స్థాయి వెడ్డింగ్ డెస్టినేషన్‌గా మార్చగల ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయని వివరించారు. భారతదేశంలో పెళ్లిళ్ల పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందని, అందులో తెలంగాణ రాష్ర్టం కీలకపాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి అన్నారు. వెడ్డింగ్ ప్లానర్లు తెలంగాణను కేవలం ఒక రాష్ర్టంగా కాకుండా, ఒక జీవించే సంస్కృతిగా కొత్త దృష్టితో చూడాలన్నారు. 

భారతదేశంలోనే కాక తెలంగాణను అంతర్జాతీయంగా పరిచయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. లైసెన్సులు, అనుమతులు, లాజిస్టిక్స్, వివాహాల నిర్వహణకు అవసరమైన అనుమ తులు వేగంగా మంజూరు చేస్తామని, ప్రైవేట్-పబ్లిక్ భాగస్వామ్యంతో ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కొత్త విధానాలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ స్పెష ల్ సీఎస్ జయేష్ రంజన్, టీసీఈఐ అధ్యక్షుడు ఆళ్ల బలరాం బాబు, ప్రధాన కార్యదర్శి రవి బురా తదితరులు పాల్గొన్నారు.