calender_icon.png 10 February, 2026 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీచర్ల ఆత్మగౌరవం పెంచిన పీఆర్టీయూటీఎస్

10-02-2026 01:54:07 AM

ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి ): గత 55 సంవత్సరాలుగా ఎన్నో చారిత్రాత్మక జీఓలు సాధించి ఉపాధ్యాయులు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన సంఘం పీఆర్టీయూ టీఎస్ అని టీచర్ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. సోమవారం సంఘ ఆవిర్భావ దినోత్సవాన్ని హైదరాబాద్‌లోని రాష్ట్ర కా ర్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్ రెడ్డి సం ఘం జెండాని ఆవిష్కరించారు.

అనంతరం పీఆర్టీయూటీఎస్ వ్యవస్థాపకులు సామల యాదగిరి విగ్రహాన్ని సామల యాదగిరి కు టుంబ సభ్యుల సమక్షంలో ఎమ్మెల్సీ శ్రీపా ల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...దేశంలోనే అతిపెద్ద సంఘంగా పీఆర్టీయూ టీఎస్ ఉందని, ఉపాధ్యాయుల ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించిందన్నారు. దేశంలోనే ఉపాధ్యాయులకు తొలిసారిగా కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చి బదిలీలు,

పోస్టింగ్‌లకు సంబంధించిన ఉత్తర్వులను తీసుకొచ్చినట్లు తెలిపా రు. సకల జనుల సమ్మెతో సహా ఇతర సమ్మె కాలానికి వేతనం పొందడం దేశంలో కేవ లం పీఆర్టీయూటీఎస్ సంఘానికే సాధ్యమైందన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం గౌడ్, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, గుండు లక్ష్మణ్, నాయకులు జగన్ మోహన్ గుప్త, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు