calender_icon.png 11 December, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఎస్‌ఎల్వీ విజయవంతం

06-12-2024 03:17:28 AM

ఐరోపాకు చెందిన ప్రోబా నింగిలోకి

గురువారం సాయంత్రం నిప్పులు చిమ్ముతూ నింగిలోకి..

హర్షం వ్యక్తం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: ఆదిత్య ఎల్1 సక్సెస్‌తో జోష్‌లో ఉన్న భారత అంతరిక్ష కేంద్రం (ఇస్రో) మరో ప్రయోగం చేపట్టగా అదీ విజయవంతమైంది. ఇస్రో శాస్త్రవేత్తలు గురువా రం యురోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ)కు చెందిన ప్రోబా మిషన్‌ను విజయ వంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

భారత కాలమానం ప్రకారం గురువారం సా యంత్రం 4.04 గంటలకు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. ఈఎస్‌ఏ, ఇస్రో మధ్య కుదిరిన ఒప్పందం మేరకు యూరోప్‌కు చెందిన ప్రోబా శాటిలైట్‌ను పీఎ స్‌ఎల్వీ సీ59 ద్వారా నింగిలోకి పంపారు. ఈ ప్రయోగం ద్వారా సూర్యుడి గురించి మరిన్ని వివరాలు కనుక్కోనున్నారు.  

బుధవారమే ప్రయోగించాల్సి ఉన్నా..

ఈ ప్రయోగాన్ని బుధవారమే చేపట్టాలని తొలుత భావించారు. కానీ ప్రోబా శాటిలైట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల ప్రయోగం గురువారానికి వాయిదా పడింది. ప్రయోగం వాయిదా పడినా గురువారం మాత్రం విజయవంతంగా పూర్తయింది. 

అసలెందుకిది.. 

ప్రోబా రెండు శాటిలైట్లు కరోనాగ్రాఫ్, ఆక్యుల్టర్ ఉంటాయి. ఈ రెండు ఉప గ్రహాలు మొత్తం 550 కిలోల బరువు ఉంటాయి. ఈ రెండు ఉపగ్రహాలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ క్రమ పద్ధతిలో భూకక్ష్యలో పరిభ్రమించనున్నాయి.

కృతిమ సూర్యగ్రహణాన్ని సృష్టిం చేందుకు, సూర్యుడి బాహ్య వలయం కరోనాపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఇస్రో చంద్రయాన్ ద్వారా చంద్రుడి ఉపరితలం గురించి అక్కడి పరిస్థితుల గురించి విలువైన సమాచారాన్ని తెలుసుకుంది. ఇప్పుడు ఈ ప్రయోగం ద్వారా సూర్యుడి కరోనా గురించి అధ్యయనం చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు వీలుపడుతుంది.   

శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ అభినందనలు

ఇస్రో పీఎస్‌ఎల్వీ  ప్రయోగం విజయవంతం అయింది. పీఎస్‌ఎల్వీ, ప్రోబా శాస్త్రవేత్తల కృషి అభినందనీయం. సరైన కక్ష్యలోకి మిషన్ చేరుకుంది. ఈ విజయంతో ఇస్రో మరో మైలురాయిని చేరుకుంది. 


ఇస్రో సిగలో 

మరో మైలురాయిఈ ప్రయోగం ఇస్రో చరిత్రలో మరో మైలురాయిగా నిలవనుంది. పీఎస్‌ఎల్వీ 59 ప్రయోగంతో ఇస్రో మరో మైలురాయిని అందుకుంది. ఇటువంటి తరహా ప్రయోగం చేయ డం చరిత్రలో ఇదే మొదటి సారి. ఇన్ని రోజులు కేవలం భారత్‌కు సంబంధించిన ఉపగ్రహాలనే కక్ష్యలోకి పంపిన ఇస్రో ఈ ప్రయోగంలో మాత్రం యురోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఉపగ్రహం ప్రోబా కక్ష్యలోకి చేర్చింది. ఈ ప్రయోగం విజయవంతం అయిందని ఇస్రో సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.