calender_icon.png 17 May, 2025 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈజీఎస్ పనుల వద్దే పిటిఎం సమావేశం

16-05-2025 07:44:08 PM

ప్రభుత్వ చేయూతను సద్వినియం చేసుకోవాలి 

ప్రధానోపాధ్యాయులు అబ్దుల్లా షరీఫ్

సిద్దిపేట,(విజయక్రాంతి): బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం అందిస్తున్న చేయూతను సద్వినియోగం చేసుకోవాలని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్లా షరీఫ్ కోరారు. శుక్రవారం రామంచ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం ఈజీఎస్ పనులు నిర్వహిస్తున్న వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి అక్కడ గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులతో పిటిఎం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో అమలు జరుగుతున్న విద్యా బోధన, ఇతర కార్యక్రమాలను వివరించారు.

ప్రైవేట్ పాఠశాలలకు కాకుండా మన గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలోనే విద్యార్థులను చదివించాలన్నారు. ప్రతి విద్యార్థి రోజు బడికి వచ్చేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పాఠశాల బోధన, మధ్యాహ్న భోజనం విషయంలో ఏమైనా లోపాలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరారు. రామంచ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు దాతల సహాయంతో ఆరేళ్లుగా నోట్ బుక్స్, స్టేషనరీ , ప్లేట్లు, గ్లాసులు,  బ్యాగులు, వాటర్ బాటిల్స్ , స్పోర్ట్  డ్రెస్సులు, టై బెల్టులు, పరీక్ష ప్యాడ్స్, రిబ్బన్స్ అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సురేష్ కుమార్, యాదయ్య, లలిత, సునీత, నాగమణి, వాణి తదితరులు పాల్గొన్నారు.