calender_icon.png 24 August, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అస్తవ్యస్తం పులిపాటి ప్రసాద్ పారామెడికల్ కాలేజీ వ్యవహారం

23-08-2025 09:05:08 PM

ఒకే భవనంలో మూడు కళాశాలలో సంతకాలు చేయని అధ్యాపకులు 

డి ఎం అండ్ హెచ్ ఓ తనిఖీలో వెలుగు చూసిన వైనం 

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రౌతును పట్టే గుర్రం.. అన్న సామెత అక్షరాల నిరూపణ అవుతుంది... అధికారులు ఆమ్యామ్యాలకు అలవాటు పడి తనిఖీలు విస్మరించడంతో, అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోయినట్లు పులిపాటి ప్రసాద్ పారామెడికల్ కాలేజీ(Pulipati Prasad Paramedical College) వ్యవహారం ధృవపరుస్తోంది. కళాశాల నిర్వహణపై వస్తున్న ఆరోపణలు దృష్ట్యా శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు పులిపాటి ప్రసాద్ పారా మెడికల్ కళశాల బండారం బయటపడింది. విద్యార్థుల రిజిస్టర్లు, అధ్యాపకుల, రిజిస్టర్లను తనిఖీ చేసి అర్హత లేని అధ్యాపకులతో బోధన జరుపుతున్నట్లు గుర్తించారు. అర్హత ఉన్న అధ్యాపకులతోనే తరగతుల నిర్వహించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. ఒకే భవనంలో మూడు కళాశాలల బోర్డులను ఉన్నట్లు గుర్తించి తక్షణమే వాటిన తొలగించారు.

ఎటువంటి బోర్డు పెట్టకుండానే పెంటెక్ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ, ఎమ్మెలీటి, కాలేజ్ అని పులిపాటి విద్యాసంస్థలవారే అదే భవనంలో నిర్వహిస్తున్నట్లు తేటతెలమైంది. అనంతరం ఆమె మాట్లాడుతూ పులిపాటి కళాశాలలోని లోపాలపై, సిబ్బంది విద్యార్హతపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులకు, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులకు నివేదిక అందించనున్నట్లు తెలిపారు . పులిపాటి గ్రూప్ ఆఫ్ కళాశాలలకు సంబంధిత అధికారులు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. తనిఖీల సమయంలో సిబ్బంది ఉపాధ్యాపకుల శాలరీ స్టేట్మెంట్ ఇవ్వమని కోరగా అందించకపోవడం గమనాహరం. అటెండెన్స్ రిజిస్టర్లో కొంతమంది అధ్యాపకుల సంతకాలు నెలల తరబడి లేకపోవడాన్ని ఆమె గుర్తించారు. దీన్నిబట్టి సంవత్సరాలుగా నడుస్తున్న పులిపాటి ప్రసాద్ పారా మెడికల్ కాలేజీలో నిబంధనలు తుంగలో తొక్కినట్టు తెలుస్తోంది.