calender_icon.png 24 August, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యలపై పోరాడుతాం

23-08-2025 09:07:51 PM

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్ నాయక్..

మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాడుతామని మహబూబాబాద్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి మదన్ నాయక్(District BJP General Secretary Madan Nayak) తెలిపారు. కేసముద్రం మండలంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు రమేష్ అధ్యక్షతన లక్ష్మి సాయి గార్డెన్స్ లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి  మదన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నీళ్లు, నిధులు, నియామకాల పేరిట ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాబందుల్లా దోచుకున్నారని ఆరోపించారు. ఇక అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 18 నెలలుగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా దున్నపోతు మీద వర్షం పడినట్టు వ్యవహరిస్తుందన్నారు.

ప్రజా సమస్యల మీద బిజెపి రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేపట్టి, కేసిఆర్ ను గద్దె దించడంలో ప్రధాన పాత్ర పోషించిందని గుర్తు చేసారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కేసముద్రం మండలంలో ని గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి చెందలేదని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అన్ని స్థానిక సంస్థలకు సరైన సమయంలో ఎన్నికలు నిర్వహించక పొవట వలన గ్రామా పంచాయతిలకు  రావలిసిన కోట్లాది రూపాయల కేంద్ర నిధులు మురిగి పోయి గ్రామిణా అభివృద్ది కుంటుపడుతున్నదన్నారు. గ్రామపంచయతిలో పంచాయతి అధికారులకు పరిపాలన భారంగా మారిందన్నారు. వెంటనే అన్ని స్తానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి  బిజెపి కార్యకర్తలు పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం కేసముద్రం తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కేసముద్రం మండలం లోని వివిధ గ్రామల ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందజేసారు.  బిజెపి మండల అద్యక్షుడు ఉప్పునూతల రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు పొదిల నరసింహ రెడ్డి , మండల ప్రధాన కార్యదర్శిలు బోగోజు నాగేశ్వర చారి, ఉపేందర్ , మండల ఉపాద్యక్షులు కొండపల్లి మహేందర్ రెడ్డి, నాగరాబోయిన చంద్రకళ, కార్యదర్శి జాటోత్ నరేష్ ,మాల్యాల రాములు, పూర్ణకంటి భాస్కర్ , బండి వెంకన్న ,శ్రీను ,రమేష్ నాయక్ ,సురేష్ నాయక్ ,మంగా వెంకన్న, భుక్య విజయ్ , జంగిటి అనిల్ ,సింగంశెట్టి మధుకర్ , పరకాల మురళీ, మైనారిటీ మోర్చా నాయకుడు ఖాసిం తదితరులు పాల్గొన్నారు.