calender_icon.png 24 August, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టరేట్ సాధించడానికి తల్లి దండ్రులు కృషి మరువలేనిది: డాక్టర్ కే.సుధా రాణి

23-08-2025 09:04:10 PM

గద్వాల: ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన 84 స్నాతకోత్సవంలొ  కే.సుధా రాణి గవర్నర్ సమక్షంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్ట అందుకున్నారు. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం యక్తాపూర్ గ్రామంకు చెందిన యేసుపు భాగ్యమ్మల మూడో కుమార్తె కే సుధా రాణి. ఆమె మేలచెరువు గ్రామంలో  ప్రాథమిక విద్య గద్వాల్ లో పదవ తరగతి పూర్తి చేసి రాయలసీమ యూనివర్సిటీ లో డిగ్రీ మరియు ఉస్మానియా యూనివర్సిటీ లయోలా కాలేజీలో పీజీ పూర్తి చేశారు.

జెనెటిక్స్, బయోటెక్నాలజీ విభాగంలో ప్రొఫెసర్  ఏ.రోజా రాణి  పర్యవేక్షణలో "క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఫైటో ఎక్ట్రాక్ట్ ఫర్ యాంటీ ఎపిలెప్సీ యాక్టివిటీ ఆఫ్ ఆకలిఫా ఇండికా " అనే పరిశోధన అంశం పై పరిశోధనలు చేశారు.ఈ సందర్భంగా కే.సుధా రాణి మాట్లాడుతు ఎపిలెప్సీ వ్యాధి ని తగ్గించడానికి భారత దేశంలో ఉండే ఔషధ మొక్కలు ఎంతగానో దోహద పడతాయని తెలిపారు.భవిష్యత్ లో ఇంకా ఎపిలెప్సీ వ్యాధిపై పరిశోధనలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలన్నది తన లక్ష్యం అని డాక్టర్ కే.సుధా రాణి అన్నారు.ఈ సందర్బంగా తల్లి దండ్రులు మరియు కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు సుధా రాణి ను అభినందించారు.