calender_icon.png 17 May, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం తాగించారు.. మత్తులోకి దించారు

16-05-2025 07:41:21 PM

గొంతు నులిమీ... ప్రైవేట్ పార్ట్ లో కత్తితో గాయపరిచారు

 భర్త చావుకు భార్య కారణం

షేక్  అహ్మద్ సాబ్ హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో లింగారెడ్డిపేటకు చెందిన షేక్ అహ్మద్ సాబ్ అనే వ్యక్తిని, అతని భార్య, అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనీ, హతమార్చిన సంఘటన ఎల్లారెడ్డి మండలంలో నెలకొంది. ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో సీఐ రవీందర్ నాయక్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో సిఐ రవీందర్ నాయక్, ఎస్ఐ మహేష్ నిందితుల వివరాలు వెల్లడించారు. ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగారెడ్డిపేటకు చెందిన షేక్ అహ్మద్ సాబ్(47) హత్య కేసును పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కేసును ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా గుర్తించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి కీలక ఆధారాలను సేకరించారు. అరెస్టైన నిందితులలో సాపెళ్లి గ్రామానికి చెందిన కూర్మ సాయిలు, లింగారెడ్డిపేటకు చెందిన పౌలవ్వ, 2025 జనవరి 24వ తేదీన షేక్ అహ్మద్ అదృశ్యమయ్యాడని, మృతుడి భార్య జనవరి 28న  ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో తన భర్త మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేసింది.

మృత్రుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు, పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.,విచారణలో అనుమానాస్పద అంశాలు వెలుగులోకి రావడంతో దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. నిందితులైన పౌలవ్వ, కూర్మ సాయిలు మధ్య అక్రమ సంబంధం నెలకొనడంతో. షేక్ అహ్మద్ ఈ సంబంధానికి అడ్డుపడుతున్నాడనే కారణంగా, ఇద్దరూ కలిసి అతన్ని హత్య చేయాలని పథకం రచించారు. జనవరి 24న, అహ్మద్‌ను పూజ పేరుతో ఎల్లారెడ్డి అడవిలోని గుట్ట ప్రాంతానికి తీసుకెళ్లి, మద్యం తాగించి మత్తులో ఉన్న సమయంలో గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం అతని పురుషాంగాన్ని నలిపి, శరీరంపై పెట్రోల్ పోసి కాల్చి చంపారని హంతకులు తెలిపినట్లు సిఐ రవీందర్ నాయక్ అన్నారు.తరువాత పౌలవ్వ అనుమానం రాకుండా మిస్సింగ్ ఫిర్యాదు చేసి పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. అయితే కాల్ రికార్డులు, ఫోన్ లొకేషన్‌లు, ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా అసలు నిజాన్ని పోలీసులు వెలికితీశారు.

నిందితుల పూర్తి ఒప్పుకోలు (కంప్లీట్ కాన్ఫెషన్)  హతుడి మొబైల్ ఫోన్, వెండి కడియం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఉపయోగించిన TVS XL ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని కాల్ డేటా, లొకేషన్ ఆధారాలు సేకరించారు. సంఘటన స్థల పరిశీలన ఇద్దరు నిందితులను, శుక్రవారం అరెస్ట్ చేసి, మున్సిఫ్ కోర్ట్ న్యాయమూర్తి ముందు హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు ఛేదనలో ఎల్లారెడ్డి సీఐ,రవీందర్ నాయక్ నేతృత్వంలో విశేష కృషి చేసిన ఎస్‌ఐ బి మహేష్ , పోలీస్ బృందం,  కానిస్టేబుళ్లు అనిల్, సిద్ధు, ప్రసాద్, ఇద్రిస్‌లకు జిల్లా ఎస్పీ  అభినందించారు.