calender_icon.png 24 August, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేయాలి

23-08-2025 09:01:10 PM

ప్రజా ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు ముగిసినప్పటికీ జాడ లేని కొత్త పెన్షన్లు

వికలాంగులకు, వితంతువులకు పింఛన్లు పెంచాలి

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ప్రభుత్వానికి డిమాండ్

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని బాలగౌడ్ ఫంక్షన్ హాల్లో వికలాంగుల సమస్యల పట్ల తెలంగాణ రాష్ట్ర ఎంఆర్పిఎస్ నాయకులు డాక్టర్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ(MRPS leader Manda Krishna Madiga) వికలాంగుల పట్ల నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఎన్నికల సమయంలో వికలాంగులకు 4000 నుంచి 6000 రూపాయల, వరకు పింఛన్లు పెంచుతానని, వితంతువులకు పింఛన్లు పెంచుతానని, హామీ ఇచ్చి ప్రస్తుతం చేతులు ఎత్తివేసారంటూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రేవంత్ రెడ్డి సర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓట్ల కోసం హామీ ఇచ్చి, గద్దెనెక్కిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ హామీలు మరచిపోయిడు అంటూ, మందకృష్ణ మాదిగ రేవంత్ రెడ్డి సర్కార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

శనివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో జరిగిన మహాగర్జన సందహాక సభకు ముఖ్య అతిథిగా హాజరైన పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు ఎల్లారెడ్డిలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం  సభలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం కోసం,హామీలు ఇచ్చి, గద్దెనెక్కిన తర్వాత వాటిని మరిచిపోయాడంటూ,కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రంగా విమర్శలకు దిగారు.వికలాంగులకు 4000 నుంచి 6 వేల రూపాయల పింఛన్ పెంచుతానని, వితంతువులు, వృద్ధులకు 4వేల రూపాయల పింఛన్లు అందిస్తానని మాట ఇచ్చి మర్చిపోయాడు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పై మందకృష్ణ మాదిగ మండిపడ్డారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీల్లో ఒకటి కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదంటూ మందకృష్ణ మాదిగ ఆరోపించారు.

ఒకవైపు అన్నదాతలు యూరియా కోసం పోరాడుతుంటే మరొకవైపు కాంగ్రెస్ల కుమ్ములాటలు సాగుతున్నాయని మందకృష్ణ మాదిగ విమర్శించారు. ప్రజల పాలన పక్కనపెట్టి,పార్టీ మారిన ఫిర్యాంపు దార్ల ఎమ్మెల్యేల విషయంలో,బిజీ బజీగా గడుపుతున్నారని మందకృష్ణ మాదిగ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ పై మండిపడ్డారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సంపూర్ణంగా నెరవేర్చే వరకు ఎంఆర్పిఎస్ తీవ్రంగా పోరాడుతుందని,ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్కు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు.రాష్ట్ర దివ్యంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షురాలు సుజాత, ఆదిమూలం సతీష్, బట్టు సాయిలు, సూర్య వంశీ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి మంథని,భారీ సంఖ్యలో, వికలాంగులు, వితంతువులు పాల్గొన్నారు.