మెట్రోలో ప్రజాపాలన వేడుకలు
- * 25 స్టేషన్లలో తెలంగాణ తల్లి చిత్రపటాల ప్రదర్శన
* మెట్రో ఫేజ్ 2 ప్రాముఖ్యతను తెలుపుతూ స్టాండీల ఏర్పాటు
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 8(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ వేడుకలను హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థలో ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తెలంగాణతల్లి విగ్రహ నమూనా చిత్రాన్ని రద్దీగా ఉండే 25 మెట్రో స్టేషన్లలో ప్రదర్శించినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు మెట్రో స్టేషన్లకు విద్యుత్ కాంతుల అలంకరణలు చేసినట్టు వివరించారు. ఈ సంవత్సరం ప్రభుత్వం సాధించిన విజయాలు, మెట్రో సాధించిన ప్రగతిని వివరిస్తూ మెట్రో స్టేషన్లలోని కాన్‌కోర్స్, ప్లాట్‌ఫామ్‌లలో స్టాండీలను ఏర్పాటు చేశామని చెప్పారు. మెట్రో కారిడార్లలో కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.






