calender_icon.png 17 July, 2025 | 9:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సంఘాలకు అండగా ప్రజా ప్రభుత్వం

14-07-2025 01:52:07 AM

  1. సకాలంలో వడ్డీలేని రుణాల చెల్లింపు
  2. ఈ నెల 18 వరకు నియోజకవర్గాల వారీగా చెక్కుల పంపిణీ
  3. ప్రజా ప్రభుత్వంలో ఎస్‌హెచ్‌జీలకు కొత్త ఉత్సాహం

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. క్రమం తప్పకుండా మహిళా సం ఘాలకు వడ్డీలు చెల్లిస్తున్న ప్రభుత్వం తా జాగా మరో రూ. 344 కోట్ల వడ్డీలను విడుదల చేసింది. ఇందులో రూ.300 కో ట్లు గ్రామీణ ప్రాంతాల మహిళా సంఘాలకు, రూ.44 కోట్లు పట్టణ సంఘాలకు కేటాయించారు. ఈ నెల 18 లోగా అన్ని సంఘాల ఖాతాల్లో వడ్డీ రాయితీ నేరుగా జమ చేయనుంది.

అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు వడ్డీ రాయితీ చెక్కులతోపాటు ప్రమాద బీమా, లోన్ బీమా చెక్కులు పంపిణీ చే యనున్నారు. ఈ కార్యక్రమం మహిళలకు ఆర్థిక భద్రతను కల్పించే దిశగా మ రో కీలక అడుగుగా నిలవనుంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో వడ్డీ లేని రుణాల పథకం పూర్తిగా నిర్వీర్యమైపోయింది.

2019 నుంచి 2023 మధ్యకా లంలో రూ.3,075 కోట్లకు పైగా వడ్డీ రా యితీలు బకాయిలుగా  మిగిలిపోయాయి. మహిళా సాధికారతను పరిగణ నలోకి తీసుకోకుండా నిర్లక్ష్యంం చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడు పథకానికి కొత్త శక్తి వచ్చిందని మహిళా సంఘాలు భావిస్తున్నాయి.

మంత్రి సీతక్క చొరవతో

 సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశనలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క చొరవతో  పథకం మరిం త సమర్థవంతంగా అమలవుతోంది. బ్యాంకుల ద్వారా మహిళలు తీసుకునే రుణాలపై వడ్డీ రాయితీని ప్రభుత్వమే భరిస్తోంది. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన త ర్వాత రూ.518.69 కోట్లు మహిళా సం ఘాలకు వడ్డీల రూపంలో ప్రభుత్వం చె ల్లించగా, ఇప్పుడు తాజాగా మరో 344. 35 కోట్లను విడుదల చేసింది.

దీంతో మ హిళా సంఘాలకు మొత్తం రూ. 862.04 కోట్లు విడుదల చేసింది. ఇందిరా మహి ళా శక్తి సంబరాల్లో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలు తీసుకున్న రుణాలకు చెక్కుల రూపంలో వడ్డీలను ప్రభుత్వం చెల్లించనుంది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సకాలంలో నిధులు జమ అవుతుండటంతో మహిళా సంఘాల్లో విశ్వాసం, ఉత్సాహం పెరిగింది.

ఇది సీతక్క పనితీరుకు నిదర్శనం, కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్దికి ప్రతీక అని సంఘాల సభ్యులు పేర్కొంటున్నారు. ఈ  సందర్భంగా సీతక్క స్పందిస్తూ మహిళల ఆర్థిక సాధికారతే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఏటా రూ. 25 వేల కోట్లకు తగ్గకుండా రుణాలను మహిళా సంఘాలకు సమకూర్చుతున్నామని తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీల భారం లేకుండా వారి తరఫున ప్రభుత్వమే వడ్డీలను చెల్లిస్తుందని స్పష్టం చేశారు.