14 May, 2026 | 4:02 AM

ట్రాన్స్‌పోర్ట్ మాయ

14-05-2026 02:51 AM

రైతన్నల రెక్కల కష్టం దోపిడి

మిల్లర్ మాఫియాకు సహకరిస్తున్న అధికారులు 

తరుగు పేరిట నిలువు దోపిడీ 

ధాన్యం కొను గోల్ మాల్ 

ప్రతి సీజన్లో లక్షల క్వింటాళ్ల దోపిడి 

రైతన్నలను పట్టించుకొని ప్రజా ప్రతినిధులు 

నిలువు దోపిడికి గురవుతున్న రైతన్నలు 

కామారెడ్డి, మే 13 (విజయక్రాంతి): మిల్లర్ల మాయజాలానికి రైతన్నలు బలవుతున్నారు. ప్రభుత్వం ఒక వైపు ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని అమ్ముకొని మద్దతు ధర పొందాలని చెప్తున్నా ఆచరణలో మాత్రం రైతన్న లు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ప్రతి సీజన్లో లక్షల క్వింటాళ్ల ధాన్యం తరుగు పేరిట కొనుగోలు కేంద్రాల్లో నొక్కేయడమే కాకుండా మిల్లర్లు సైతం తరుగు తీసి కాంటా పెట్టుకుంటున్నారు. దీంతో రెండు చోట్ల రైతన్నలు నిలువు దోపిడీకి గురవుతున్నారు. 

తరుగు పేరిట రైతుల ధాన్యం దోపిడి 

కామారెడ్డి జిల్లాలో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు అసలే ఆలస్యంగా ఏర్పాటు చేసిన అధికారులు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తెచ్చిన ధాన్యాన్ని తరువు పేరుట నిలువు దోపిడికి గురిచేస్తున్నారు. క్వింటాలకు నాలుగు కిలోల నుంచి 10 కిలోల వరకు తరుగు తీస్తు తూకం వేస్తున్నారు. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు మాత్రం క్వింటాలకు నాలుగు కిలోలు మాత్రమే తరుగు తీస్తున్నట్లు నటిస్తున్నారు. నిత్యము మాత్రం రైతులను తరుగు పేరిట నిలువు దోపిడికి గురిచేస్తున్నారు.

రైస్ మిల్లర్రు, అధికారులు, కొనుగోలు కేంద్రాల సెంటర్ నిర్వాహకులు సైతం కుమ్మక్కై రైతులను దోపిడీకి గురి చేస్తున్నారు. దీంతో రైతులు నిలువునా నష్టపోతున్నారు. అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోకపోవడంతో దాన్యం కాంట కావడమే తమ కష్టాలు తీరుతున్నాయని రైతులు సర్దుకుంటున్నారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చిన నుంచి రైతన్నలకు తంటాలు తప్పడం లేదు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రం నిర్వాకులు, అధికారులు చూడాలని ఒకవైపు కలెక్టర్ కొనుగోలు కేంద్రాల సందర్శనాల్లో చెబుతున్న ఆచరణలో మాత్రం అధికారులు అమలు చేయడం లేదు. 

ప్రతి ఏటా లక్షల టన్నుల దోపిడి 

వర్షాకాలం, వేసవికాలంలో వరి ధాన్యం చేతికి రాగానే ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని భావిస్తున్న రైతులకు అధికారులు, రైస్ మిల్లర్లు కుమ్మక్కై తరుగూ పేరిట దోపిడి చేస్తున్నారని రైతు లు ఆరోపిస్తున్నారు.

తేమ శాతం తీసిన తర్వాత తరుగు తీయడం ఏంటి 

కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తెచ్చిన తర్వాత తేమా శాతం వచ్చిన తర్వాతే ధాన్యాన్ని కాంటా పెడుతున్నారు. దీంతోపాటు మరికొంత తరుగు తీయడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. మిల్లర్ వద్దకు వెళ్తే ధాన్యం తరు గు ఏర్పడుతుందని సాకుతో రైతుల నుంచి బస్తాకు నాలుగు కిలోల చొప్పున తరుగు తీస్తున్నారు. దీంతో ఒక రైతు 50 కింటల ధాన్యం పండిస్తే కొనుగోలు కేంద్రంలో తరుగు పేరిట క్వింటాల్ వరకు  స్వాహా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

అధికారులు, రైస్ మిల్లర్ల కుమ్మక్కు 

ధాన్యం కొనుగోలులో కొనుగోలు సెంటర్ నిర్వాహకులతో పాటు పర్యవేక్షణ చేస్తున్న అధికారులు, రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతుల నుంచి తరుగు పేరిట నిలువు దోపిడికి గురి చేస్తున్నారని రైతుల ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు మాత్రం నామమాత్రంగా సూచనలిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. సీజన్లో వేల క్వింటాళ్ల ధాన్యాన్ని తరుగు పేరిట దోపిడి చేసి ఆ డబ్బులను రైస్ మిల్లర్లు, అధికారులు పంచుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులకు అమ్మితే ధర తక్కువ వస్తుండొచ్చు కానీ తరువు తీయరని రైతులంటున్నారు. 

ధాన్యం తరుగు దోపిడిని అరికట్టాలి

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తరుగు పేరుట దోపిడీ చేస్తున్న తీరును ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి దోపిడీకి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ప్రతి సీజన్లో లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని తరుగు పేరిట దోపిడీ చేసి డబ్బులు దండుకుంటున్నారు. తరువు పేరిట జరుగుతున్న దోపిడి తతంగాన్ని జిల్లా ఉన్నతాధికారులు అరికట్టాలని రైతులు కోరుతున్నారు. 

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం 

కామారెడ్డి జిల్లాలో దాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట దోపిడీ జరుగుతుందని జిల్లా సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు విజయ క్రాంతి ప్రతినిధి దృష్టికి తీసుకెళ్లగా సాక్షాదారాలతో ఫిర్యాదు చేస్తే దోపిడీకి పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మిల్లర్లు కొనుగోలు సెంటర్ల నిర్వాకులు దోపిడీకి పాల్పడుతున్నట్లు తమ దృష్టికి రాలేదన్నారు. రైతులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. క్వింటాల్కు రెండు కిలోలు మాత్రమే తరు గు తీస్తున్నారని, ఎక్కువ మొత్తంలో తరుగు తీస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులు నష్టపోకుండా చూస్తామన్నారు.

- వెంకటేశ్వర్లు, జిల్లా సివిల్ సప్లై అధికారి, కామారెడ్డి