15-09-2025 12:00:00 AM
కోదాడ సెప్టెంబర్ 14 : కోదాడలో స్వయంభూగా వెలసి నిత్య పూజలు అందుకుంటు భక్తుల పాలిట కోరికలుతీర్చుతు కొంగుబంగారంగా వెలసిల్లు తున్న శ్రీ గుంటి రఘునాథ స్వామి కోవెలలో నేడు శ్రీ వైష్ణవ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా కృష్ణ భగవానునికి ఉదయం అభిషేకం అర్చనలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ చలపతి ఆదివారం తెలిపారు.
సాయంత్రం 6-00 గంటలకు పుర ప్రముఖుల, భక్తుల నడుమ ఉట్లు కొట్టే ఉత్సవం జరుపబడును. స్వామి నివేదన కు ప్రసాదాలు, అలంకరణ కు పుష్పాలు సమర్పించుకోగలరని. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించి శ్రీ కృష్ణుని అనుగ్రహనికి పాత్రులు కావాలని కోరారు.