calender_icon.png 24 August, 2025 | 11:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగరంగ వైభవంగా శ్రీ శబరిమాత పాదుకల పూజ

16-12-2024 05:29:14 PM

అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు... 

తాడ్వాయి (విజయక్రాంతి): తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆశ్రమం పక్కనే ఉన్న విశాలమైన గుట్టపైన శ్రీ శబరిమాత పాదుకల పూజోత్సవ కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పాదుకాపూజోత్సవ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక మీద అమ్మవారి పాదుకల పూజకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు సైతం అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొని శ్రీ శబరి మాత ఆశీస్సులు పొందారు. ఉదయం నుంచి ఆశ్రమ ఆవరణలో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సుప్రభాతము ధ్యానంతో మొదలైన కార్యక్రమాలు రాత్రి నిర్వహించిన ప్రత్యేక భజన కీర్తనలతో ముగిశాయి. కరీంనగర్ ఇండియన్ తాడ్వాయి అదిలాబాద్ బీదర్ కరీంనగర్ మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక భజన కీర్తనలు నిర్వహించారు.

ఉదయం శ్రీ శబరి మాత అమ్మవారి పాదుకలను ప్రత్యేక వాహనంలో ఉంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. అమ్మవారి పాలకులను దర్శించుకోవడానికి భక్తులు పోటి పడ్డారు. ఊరేగింపులో కళాకారులు నిర్వహించిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు అన్ని సౌకర్యాలు సమకూర్చారు. ప్రత్యేకంగా వివిధ దూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమంలో ఇలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఉత్సవాలకు విచ్చేసిన భక్తులు శ్రీ శబరిమాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.