16-12-2024 05:36:55 PM
సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..
అబద్దాల ప్రచారం మానుకోవాలి..
నిధుల వివరాలు స్పష్టంగా తెలియజేయాలి..
బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి పంజా విజయ్ కుమార్..
రామాయంపేట (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పథకాల విషయంలో స్పష్టమైన వైఖరి తెలియజేయాలని బిజెపి మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ పంజా విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం విలేకరితో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విషయంలో సంక్షేమ పథకం అమలు చేస్తున్న విధుల గురించి తప్పుడు సంకేతాలు ప్రజలకు అందజేస్తుందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన 6 గ్యారంటీల విషయంలో ఆర్భాటాలు తప్ప అభివృద్ధి ఎక్కడ కనిపించడం లేదని ఆయన విమర్శించారు.
ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏక్కడ కూడా అమలు చేయకపోవడంతో పాటు కేవలం వారి అంగు ఆర్భాటాలకు ప్రాధమిక ఇస్తున్నారే తప్ప ప్రజల సంక్షేమ పథకాలు అమలు కోసం ఇప్పటికి ప్రయత్నించడం లేదని విమర్శించడం జరిగింది. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు కూడా ప్రచారానికి పరిమితమవుతున్నారే తప్ప ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క కార్యక్రమం చేపట్టడం లేదని విమర్శించడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పష్టమైన వైఖరి లేకుండా నోటికి వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు నిధులు వచ్చాయని మాటలు చెప్పారే తప్ప అమలు అయినట్లు ఎక్కడ కూడా నిరూపించ లేరని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టమైన వైఖరి అవలంబించాలని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంతో పాటు దేశంలో ఎక్కడైనా విధులు విడుదలయితే అందుకు సంబంధించి ప్రాంత వర్ణ వర్గాలకు సంబంధించి స్పష్టంగా నిధులు విడుదల అవుతాయని ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఏక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వకుండా కచ్చితంగా నిధులు ఎక్కడ విడుదలై వాటిని ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రజలకు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు భానుచందర్, బిజెపి సీనియర్ నాయకులు వెలుముల సిద్ధ రాములు, బిజెపి సీనియర్ నాయకుడు శంకర్ గౌడ్, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.