calender_icon.png 5 August, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమయపాలన పాటించాలి

05-08-2025 12:00:00 AM

  1. పీహెచ్‌సీల తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ

గైర్హాజరైన వైద్యులకు షోకాజు నోటీసులు

దండేపల్లి, ఆగస్టు ౪ (విజయక్రాంతి): జిల్లాలోని దండేపల్లి, జన్నారం మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(పీహెచ్సీ)లను సోమ వారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎం అండ్ హెచ్‌ఓ) డాక్టర్ హరీష్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో ఆసుపత్రిలో ఉండని, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరైన జన్నారం పీహెచ్సీ డాక్టర్ లక్ష్మికి షోకాజు నోటీసులు ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీహెచ్సీలలో, సబ్ సెంటర్లలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నం దున ఎలాంటి సెలవులుండవని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సెలవులు తీసుకోవాలని, వైద్యాధికారులకు, పారామెడికల్ సిబ్బందికి, సూపర్ వైజర్లకు సూచనలిచ్చారు. సీజనల్ వ్యాధు లు ప్రభావిత గ్రామాలలో వైద్య శిభిరాలు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాటు చేయాలని, పీహెచ్సీల పరిధిలోని ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరా రు.

తెలంగాణ డయగ్నస్టిక్స్ సెంటర్‌కు ప్రతి పీహెచ్సీ నుంచి శాంపిల్స్ పంపి, రిపోరట్స్‌ను తెలుసుకొని ఇతర ప్రివెంటివ్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జన్నారం పీహెచ్సీ పరిధిలో క్యాన్సర్ కేసులు ఎక్కువ నమోదు అవుతున్నందున, పరీక్షలు చేస్తూ అవగాహన కల్పించాలని, రౌండ్ క్లాక్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సాయంత్రం ఉండే వైద్య సిబ్బంది వివరాలను గోడ పైన ఉంచాలని ఆదేశించారు.

ఈ తనిఖీల్లో అసంక్రమణ వ్యాధులు (ప్రోగ్రామ్ ఆఫీసర్ ) డాక్టర్ ప్రసాద్, డాక్టర్ ఉమాశ్రీ, డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ హరీష్, డెమో బుక్క వెంకటేశ్వర్, వైద్య సిబ్బంది, ఫార్మసిస్టులు, ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.