calender_icon.png 5 August, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులంతా జాతీయవాదం వైపు నడవాలి

05-08-2025 12:00:00 AM

డిచ్పల్లి ఆగస్టు 4 (విజయ క్రాంతి): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిచ్పల్లి శాఖ ఆధ్వర్యంలో  సోమవారం ఎస్పిఆర్ ఇంటర్, డిగ్రీ,ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ఏబీవీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించరు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో డిచ్పల్లిలోని కళాశాల విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పెద్ద ఎత్తున జరిగిన సభ్యత్వంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు బి శివ హాజరయ్యారు. ఆయన  మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ దేశంలో ఉన్న,పేద బడుగు బలహీన విద్యార్థుల కోసం నిరంతరం పనిచే స్తున్న జాతీయవాద విద్యార్థి సంఘం ఏబీవీపీ, 1949 జులై 9న ఐదుగురితో ప్రారంభ మైనరు. ఏబీవీపీ నేడు 55 లక్షల మెంబర్షిప్ తో నిరంతరం దేశం కోసం విద్యార్థుల కోసం పనిచేస్తుందన్నారు.

క్షణం క్షణం మా కణం కణం భరతమాతకు సమర్పణమంటూ భరతమాత సేవ కోసం నిరంతరం పనిచేస్తుంది ఏబీవీపీ పేర్కొన్నారు.విద్యార్థులంతా జాతీయ భావాలతో  దేశం కోసం పని చేయాలని  అలాగే దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు ఏబీవీపీలో సభ్యత్వం తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ సెక్రెటరీ సమీర్,తెలంగాణలోనిస్ట్ జాయింట్ సెక్రటరీలో లెనిన్, అనిల్,ఎగ్జిక్యూటివ్ మెంబర్లు నెహ్రు, రామకృష్ణ,హర్ష నందన్ తదితరులు పాల్గొన్నారు.