08-05-2025 05:30:01 PM
నిర్మల్ (విజయక్రాంతి): యాసంగిలో వరి ధాన్యం పండించిన రైతన్నకి మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమారెడ్డి(Market Committee Chairman Soma Bhimareddy) అన్నారు. గురువారం నిర్మల్ రూరల్ మండలంలోని అనంతపేట గ్రామంలో పిఎసిఎస్ చైర్మన్ గంగాధర్ తో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని ధాన్యం విక్రయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం బోస్ సిబ్బంది పాల్గొన్నారు.