18-10-2025 03:56:06 PM
బోయినపల్లి,(విజయక్రాంతి): పాఠశాల విద్యార్థులకి నిరంతరం కృషిచేయ నున్నట్లు కొదురుపాక గ్రామానికి చెందిన మహిళా న్యాయమూర్తి తల్లిదండ్రులైన తాడిగొప్పుల మురళి-విజయ దంపతులు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా వారు ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ను అందించారు. ఈ సందర్భంగా ఆ దంపతులు వాటర్ ప్లాంట్ ను గ్రామస్తులతో కలసి ప్రారంభించారు. అనంతరం ఆ దంపతులు మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమానికి తన కూతురు న్యాయమూర్తి మా కుటుంబం ఇప్పటికీ పని చేస్తానని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బండి శ్రీనివాస్, ఎంఈఓ శ్రవణ్ కుమార్, హెచ్ఎం రవి సురేందర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.