18-10-2025 03:55:24 PM
గంజాయి,డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలు, విద్యార్థులు భాగస్వామ్యం కావాలి.
తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.
జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.
వీర్నపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీర్నపల్లి మండలంలోని(Veernapalli Mandal) గర్జనపల్లి ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి రహిత సమాజం మనందరిదీ బాధ్యతని పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయిని నిర్మూలించడంలో ప్రతి పౌరుడూ బాధ్యతగలవారిగా వ్యవహరించి,ఈమత్తు పదార్థాల నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు, యువతకు, విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పక్కా ప్రణాళికతో చదువుకొని ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ ను వినియోగించడం వల్ల సమాజానికి ఇబ్బంది కలిగించే పౌరులుగా మారవద్దని సూచించారు.
తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, అవసరమైతే.సమయాను కూలంగా మార్గనిర్దేశనం చేయాలని సూచించారు. డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు, కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు, ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని చెప్పారు. అలాగే డ్రగ్స్ వినియోగం శారీరక నష్టాలకే పరిమితం కాకుండా మానసిక సమస్యలు, సామాజిక రుగ్మతలను కూడా పెంచుతుందని వివరించారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన పెంచుకొని వాటికి దూరంగా ఉంటూ ఉత్తమ సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములవ్వాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. గర్జనపల్లి గ్రామానికి చెందిన సీఐడీ ఎస్పీ రాంరెడ్డి భూక్య శ్రీధూమ నాయక్ భూక్యా సామాజిక సేవ ట్రస్ట్ స్థాపించి సామాజిక సేవకార్యక్రమలు చేయడం అభినందనియమని ఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీధూమ నాయక్ భూక్యా సామాజిక సేవ ట్రస్ట్ సభ్యులు, సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ లక్ష్మణ్, విద్యార్థులు పాల్గొన్నారు.