24 June, 2026 | 2:31 AM

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి!

11-06-2024 12:43 AM

 సక్సెస్‌ఫుల్ ఫైనాన్స్ మినిస్టర్‌గా పేరొందిన నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ, జూన్ 10: ప్రధాని నరేంద్రమోదీ క్యాబినెట్ 3.0లో కేంద్ర ఆర్థిక మంత్రి పగ్గాలను మరోసారి నిర్మలా సీతారామన్‌కు అప్పజెప్పారు. వరుసగా రెండు సార్లు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్న మొద టి మహిళగా ఆమె రికార్డులోకెక్కనున్నారు. దేశంలోని రెండో తరం ఆర్థిక సంస్కరణలను ఆమె విజయవంతంగా ముందుకు తీసుకెళ్తు న్నారు. దీంతో మరోసారి ఆమెను ఆర్థిక శాఖ మంత్రి పదవి వరించింది. మోదీ రెండోసారి ప్రధాని అయిన తర్వాత 2019 మే 31 నుంచి ఇప్పటివరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

మొదటి టర్మ్‌లో అనేక అవరోధాలు, సవాళ్లు ఎదురైనా ఎదురొడ్డి నిలదొ క్కుకున్నారు. ఆమె ఆర్థిక మంత్రి అయిన వెంటనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నా రు. జీఎస్టీ అమలు, పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సమయంలో చాలా కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించి సంచలనం సృష్టించారు. మరుసటి ఏడాది కరోనా అల్లకల్లోలంతో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంటే పేదల కోసం పాలసీలు ప్రకటించి, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం పేరును నిలబెట్టా రు.

ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అల్లకల్లోలం అవుతుంటే భారత దేశం మాత్రం తలెత్తుకునేలా ఆమె నిర్ణయాలు సహకరిం చాయి. కొవిడ్ తర్వాత దేశంలో ద్రవ్య లోటు పెరుగతుండటంతో కట్టడి చేయడంలో నిర్మలా సీతారామన్ సఫలమయ్యారు. స్థూల దేశీయోత్పత్తిలో 5.8 శాతం ద్రవ్యలోటు ఉంటుందని అంచనాలు వేయగా, 5.6 శాతానికి తగ్గింది.