25-08-2025 11:33:46 AM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీకి(Osmania University) వెళ్లనున్నారు. రూ. 90 కోట్లతో నిర్మించిన భవనాలను సీఎం ప్రారంభించనున్నారు.ఉస్మానియా యూనివర్సిటీలో డిజిటల్ లైబ్రరీ పనులకు, 300 మందికి విద్యార్థులకు వసతి కల్పించే కొత్త హాస్టల్ భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. 20 ఏళ్లలో ఓయూకు వెళ్లి ప్రసంగించనున్న తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డు నెలకొల్పారు. ఓయూలో సీఎం పర్యటన దృష్ట్యా బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.