- స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
- కంటెయినర్ స్కూల్ ప్రారంభం
హనుమకొండ, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): దట్టమైన అటవీ ప్రాంతాల్లోని గిరిజనుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మంగళవారం కన్నాయిగూడెం మండలం బంగారుపల్లిలో రూ.13.50 లక్షలతో ఏర్పాటు చేసిన కంటెయినర్ పాఠశాలను మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అటవీ ప్రాంతాల గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయడానికి కేంద్ర అటవీశాఖ నిబంధనలు అడ్డంకిగా మారడంతో గిరిజన బిడ్డలకు ఎలాగైనా విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ పాఠశాలను ప్రారంభించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరో రెండు మూడు చోట్ల ఇలాంటి పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డీ మహేష్ బాబా సాహెబ్ గీతే, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్, డీఈవీ పావని పాల్గొన్నారు.