ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
25-04-2026 01:23 AM
గరిడేపల్లి, ఏప్రిల్ 24 : ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని జడ్.పి.హెచ్.ఎస్ హెచ్‌ఎం సువర్ణ అన్నారు.శుక్రవారం మండల పరిధిలోని కీతవారిగూడెం గ్రామంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాలు,దుస్తులు మధ్యాహ్న భోజ నం వంటి సౌకర్యాలను కల్పిస్తుందని ఆమె తెలిపారు.తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి భాగస్వాములు కావా లన్నారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు,గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.






