calender_icon.png 19 May, 2025 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాల్లో నాణ్యమైన విద్యాబోధన

19-05-2025 05:37:09 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకులాల్లో నాణ్యమైన విద్యా బోధనతో పాటు విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో వసతి సౌకర్యాలు కల్పించడం జరిగిందని, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను గురుకులాల్లో చేరే విధంగా ప్రోత్సహించాలని మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కే.వీరబ్రహ్మచారి(Additional Collector K. Veerabrahmachari) కోరారు. మైనారిటీ గురుకులాల్లో ప్రవేశానికి సంబంధించిన ప్రచార పోస్టర్లను అదనపు కలెక్టర్ సోమవారం జిల్లా కలెక్టరేట్ లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... మైనారిటీ సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ మీడియట్ ప్రవేశానికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపారు. విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎండబ్ల్యూఓ శ్రీనివాస రావు, ఆర్ఎల్సీ రమేష్ లాల్ హట్కె, ప్రిన్సిపాళ్లు జి. శ్రీనివాస్ రావు, ఎం.డి రహీం, వనజ, రిజ్వానా, స్వప్న పాల్గొన్నారు.