19-05-2025 05:28:29 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఈనెల 12న వైశాఖ బుద్ధ పూర్ణిమ సందర్భంగా నిర్మల్ జిల్లాలోని ముధోల్ మండలంలో గల రాళ్ల బోరిగాం గ్రామంలో జరిగిన గొడవలు దళితులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ సోమవారం దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ కార్లు వరకు ర్యాలీ నిర్వహించిన సంఘాల నాయకులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని దళితులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని అక్కడ ఆవిష్కరణ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కలిసి విన్నవించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంటోల్ల వెంకటస్వామీ, రంజిత్ కుమార్ ఎలుగు గంగాధర్, కిరణ్, భూమేష్, ఆకుల రమేష్, భీమ్ ఆర్మీ నాయకులు జంగ్మే సాహెబ్ రావ్ రాళ్ల బోరిగం గ్రామ అంబేద్కర్ యువజన సంఘం, నాయకులు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.