calender_icon.png 28 January, 2026 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోగి ఇంటివద్దకే నాణ్యమైన వైద్యం

28-01-2026 12:00:00 AM

వరంగల్ మెడికవర్ హాస్పిటల్ హోమ్ హెల్త్ కేర్ స్కేమ్

హనుమకొండ, జనవరి 27 (విజయ క్రాంతి):మెడికవర్ హాస్పిటల్, వరంగల్ తమ రోగి కేంద్రిత వైద్య సేవల నిబద్ధతను మరోసారి చాటుతూ, ఆసుపత్రిలో అందించిన సమగ్ర చికిత్స అనంతరం ఇంటివద్ద కూడా నిరంతర వైద్య సహాయం అందించే మెడికవర్ హోమ్ హెల్త్ కేర్ సేవలను విజయవంతంగా అమలు చేసింది.86 సంవత్స రాల వయసున్న పి. రామానుజ చారి అనే పురుష రోగి నిద్రలేమి, మాత్రలు మింగడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో మెడికవ ర్ హాస్పిటల్, వరంగల్లో చేరారు. ఆయనకు కన్సల్టెంట్ ఫిజీషియన్ డా. గిరీష్ లోయా  పర్యవేక్షణలో చికిత్స అందించగా, డా. లక్ష్మణ్ (కన్సల్టెంట్ యూరాలజీ) మరియు డా. వెంకటేశ్వరరావు (కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజీ) ల నుంచి సలహాలు తీసుకు న్నారు.

విస్తృత వైద్య పరీక్షల అనంతరం రోగికి మెటబాలిక్ ఎన్సెఫలోపతి, పార్కిన్సన్ వ్యాధి, మూత్రనాళ ఇన్ఫెక్షన్, బీనైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లాసియా, షుగర్ మరియు అధిక రక్తపోటు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.ఎమ్‌ఆర్‌ఐ బ్రెయిన్లో డిజెనరేటివ్ మార్పులు కనిపించగా, ఎలక్ట్రోలైట్స్ మరియు ఈఈజీ పరీక్షలు సాధారణంగా ఉన్నాయని,ఆహారం అందించేందుకు ఎండోస్కోపీ మార్గదర్శకంతో రైల్స్ ట్యూబ్ అమర్చారు.

మూత్రం లో రక్తస్రావం కనిపించడంతో యూరాలజీ విభాగం సలహా మేరకు క్యాథెటరైజేషన్ మరియు బ్లాడర్ ఇరిగేషన్ చేపట్టారు.సకాలంలో అందించిన ఐవి ద్రవాలు, యాం టీబయాటిక్స్ మరియు అవసరమైన సహాయక చికిత్సల ఫలితంగా రోగి చైతన్యం మరియు సాధారణ ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడింది. అనంతరం రోగి ని హీమోడైనమిక్‌ంగా స్థిరమైన పరిస్థితిలో డిశ్చార్జ్ చేశారు.

డిశ్చార్జ్ అనంతరం కూడా చికిత్సలో ఎలాంటి అంతరాయం కలగకుం డా ఉండేందుకు, మెడికవర్ హాస్పిటల్ వరంగల్ ద్వారా సమగ్ర హోమ్ హెల్త్ కేర్ సేవలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇందులో అర్హత కలిగిన నర్సింగ్ సిబ్బంది ఇంటికి వచ్చి సేవలందించడం, వైద్యులు కాలానుగుణంగా పర్యవేక్షణ చేయడం, శిక్షణ పొందిన కేర్టేకర్లు రోజువారీ అవసరాల్లో సహాయపడటం జరుగుతోంది.అదేవిధంగా వైటల్ సై న్స్ పర్యవేక్షణ, మందుల నిర్వహణ, క్యాథెటర్ సంరక్షణ, రైల్స్ ట్యూబ్ ద్వారా ఆహారం అందించడం మరియు పరిశుభ్రత పరిరక్షణ వంటి అన్ని వైద్య సేవలు రోగి ఇంటివద్దనే కొనసాగుతున్నాయి.