calender_icon.png 22 October, 2025 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భోజనంలో నాణ్యత ముఖ్యం

22-10-2025 12:00:00 AM

కలెక్టర్ హైమావతి 

నంగనూరు, అక్టోబర్ 21: నంగునూర్ మండలం పాలమాకుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ కె హైమావతి క్షేత్రస్థాయిలో సందర్శించారు.మధ్యాహ్న భోజనం నాణ్యత, అమలు తీరుపై కలెక్టర్ ఆరా తీశారు.రోజువారీ కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా పాటించాలని,విద్యార్థుల హాజరు ప్రకారం ఆహార పదార్థాలను కొలత వారిగా ఉపయోగించి, రుచికరంగా వండాలని వంట సిబ్బందికి సూచించారు.

పాఠశాలలో ఫుడ్ చెకింగ్ ఉపాధ్యాయుడు,హెచ్‌ఎం రోజు మొత్తం ప్రక్రియను పర్యవేక్షణ చేయాలని,పిల్లలకు చదువు,మధ్యాహ్న భోజనం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు.భోజనం నాణ్యత విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.అనంతరం విద్యార్థులతో ముచ్చటిస్తూ..మధ్యాహ్న భోజనంలో ఏం వండారని,రుచిగా ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నారు.