calender_icon.png 22 October, 2025 | 10:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌ఎస్‌ఎస్‌కు దేశ సేవే లక్ష్యం

22-10-2025 12:00:00 AM

జగదేవపూర్, అక్టోబర్ 21: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం జగదేవపూర్ శాఖ ఆధ్వర్యంలో శాఖ ఉపక్రమంలో భాగంగా జగదేవపూర్ పట్టణ కేంద్రంలోని గొల్లపల్లి రోడ్డు మూలమలుపు భారీ గుంతలను పుడ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత కొంత కాలంగా ప్రజలు పడుతున్న ఇబ్బంది చూసి గుంత ను పూడ్చినట్టు తెలిపారు. దేశం కోసం ధర్మం కోసం యువత ముందు ఉండాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు  ఏగొండ, కరుణాకర్ రెడ్డి, సంఘ సభ్యులు గాండ్ల రాజేంద్ర, రాఘవేంద్ర, రాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.