calender_icon.png 26 January, 2026 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల సమస్య పరిష్కారం కోసమే రచ్చబండ

05-08-2024 02:05:32 PM

 పేరపల్లి లో ప్రారంభోత్సంలో దుద్దిళ్ల శ్రీను బాబు 

పెద్దపల్లి, (విజయక్రాంతి): మంథని నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే గ్రామలలో నేటి నుంచి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. సోమవారం మంథని నియోజకవర్గంలో ని కమాన్ పూర్ మండలంలోని పేరపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అదేశాల మేరకు శ్రీనుబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజల సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారుల సహకారంతో పరిష్కారమయ్యేలా సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వైనాల రాజు, యూత్ మండల అధ్యక్షులు రాజు రెబల్, నాయకులు కోలేటి మారుతి, భాస్కరరావు, అన్నపూర్ణ, బొనగాని సది తదితరులు పాల్గొన్నారు.