calender_icon.png 26 January, 2026 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకతాయిలకు షీ టీమ్స్ సింహస్వప్నం

26-01-2026 12:28:48 AM

  1. ఏడాదిలో 1,149 ఫిర్యాదులకు పరిష్కారం 
  2. మహిళల భద్రతపై రాజీపడేది లేదు.. సీపీ సజ్జనార్

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 25 (విజయక్రాంతి): నమ్మి స్నేహం చేస్తే నమ్మకద్రోహం.. ప్రేమించలేదని పైశాచికం.. సోష ల్ మీడియాలో పరిచయం పెంచుకొని వ్యక్తిగత ఫొటోలతో బ్లాక్ మెయిలిం గ్.. ఇలాంటి వేధింపులతో నరకయాతన అనుభవిస్తున్న నగర మహిళలకు హైదరాబాద్ షీ టీమ్స్ కొండంత అండగా నిలుస్తు న్నాయి. ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ, మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నాయి. గడిచిన ఏడాది 2025 కాలంలో హైదరాబాద్ షీ టీమ్స్ పనితీరును విశ్లేషిస్తే సంచలన విషయాలు వెలుగుచూశాయి.

ఏడాది కాలంలో అందిన 1,149 ఫిర్యాదులను విజయవంతంగా పరిష్కరించడమే కాకుండా, నగరవ్యాప్తంగా మఫ్టీలో నిఘా పెట్టి ఏకంగా 3,826 మంది పోకిరీలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఆకతాయిల గుండెల్లో షీ సింహస్వప్నంగా మారాయి. 15 ప్రత్యేక బందాలు బస్టాండ్లు, కాలేజీలు, రద్దీ ప్రదేశాల్లో మఫ్టీ లో తిరుగుతూ ఆకతాయిల భరతం పట్టా యి. ఇలా 3,826 మందిని పట్టుకుని, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి జైలుకు పంపారు.

గోప్యంగా ఉంచుతాం.. భయం వద్దు.. సీపీ సజ్జనార్ 

మహిళల జోలికొస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, హెచ్చరించారు. బ్లాక్?మెయిలింగ్?కు భయపడి మౌనంగా భరించవద్దు. ఆపదలో ఉన్నవారు సంప్రదించాల్సిన నం బర్లు డయల్ 100 లేదా షీ టీమ్స్ వాట్సాప్ నెంబర్ 9490616555. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. మీకు రక్షణ కవచంలా నిలబడతాం. మీ వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతాం అని సీపీ హామీ ఇచ్చారు.