26-01-2026 01:16:11 AM
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన రైల్వే డిపో సాధన కమిటీ
మహబూబాబాద్, జనవరి 25 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో రైల్వే మెగా పి ఓ హెచ్ డిపో ఏర్పాటు పనులు ప్రారంభించేలా కేంద్ర ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి మహబూబాబాద్ మెగా ఫ్రైట్ మెయింటేనేన్స్ పి ఓ హెచ్ వర్క్ షాపు సాధన కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెం పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రిని వారు కలిసి పి ఓ హెచ్ ఏర్పాటు అంశంపై చర్చించారు.
పి ఓ హెచ్ డిపో ఏర్పాటు కోసం రైల్వే శాఖకు రాష్ట్ర ప్రభుత్వం 400 ఎకరాలు ప్రభుత్వ ఉచితంగా ఇస్తామని లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో త్వరగా నిర్మాణ పనులు మొదలు పెట్టేలా ఆదేశాలు ఇవ్వాలని సాధన కమిటీ సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వల్లబు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్, డిపో సాధన కమిటీ కన్వీనర్ డోలి సత్యనారాయణ, కో ఆర్డీనేటర్ మైస శ్రీనివాస్, కో కన్వీనర్ గుగ్గిళ్ళ పీరయ్య, మజ్దూర్ యూనియన్ వరంగల్ బ్రాంచ్ సెక్రెటరీ యుగంధర్ యాదవ్, ప్రభాస్ నాయక్, సుధాకర్ నాయక్, గాడిపెల్లి శ్యామ్, అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.