calender_icon.png 26 January, 2026 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదుగురు సజీవ దహనం

26-01-2026 12:54:31 AM

  1. నాంపల్లి ఫర్నిచర్ మాల్‌లో అగ్ని ప్రమాదం
  2. మృతుల్లో ఇద్దరు చిన్నారులు 
  3.   20 గంటల పాటు నరకయాతన
  4. షార్ట్ సర్క్యూట్‌తో రగిలి.. కెమికల్స్‌లో దావానంలా వ్యాప్తి 
  5. దట్టమైన పొగ, వేడి సెగలతో ఊపిరాడక ప్రాణాలు వదిలిన బాధితులు 
  6. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మంత్రి పొంగులేటి
  7. పూర్తిగా దెబ్బతిన్న భవనం..కూల్చివేతకు రంగం సిద్ధం 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 25 (విజయక్రాంతి): నాంపల్లి ఘటన అధికారుల పనితీరుపై మరోసారి తీవ్ర విమర్శలకు తావిచ్చింది. పాలకుల పట్టింపులేమి, అధికారుల నిర్లక్ష్యం, వ్యాపారుల ధన దాహం వెరసి.. ఐదు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. ఫర్నిచర్ మాల్లో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదం ఆదివారం నాటికి పెను విషాదాన్ని మిగిల్చింది.

నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనం, నామమాత్రపు ఫైర్ సేఫ్టీ కూడా లేని వ్యాపార సముదా యం చివరకు మత్యుకూపంగా మారింది. సుమారు 20 గంటల పాటు అలుముకున్న దట్టమైన పొగ, భరించలేనంత వేడి సెగల మధ్య చిక్కుకుపోయిన ఐదుగురు అమాయకులు ఊపిరాడక ప్రాణాలు వదలడం నగర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

అసలేం జరిగింది.. శనివారం ఉదయం నాంపల్లిలోని ఫర్నిచర్ మాల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు భవనమంతా విస్తరించాయి. లోపల ఫర్నిచర్, ఫోమ్, రసాయనాలు ఉండటంతో మంటల తీవ్రత అంచనాలకు మించిపోయింది. దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. ప్రమాద సమయంలో భవనంలో చిక్కుకున్న వారు బయటకు రాలేక హాహాకారాలు చేశారు. అగ్నిమాపక సిబ్బం ది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు.

అయితే భవనంలోకి వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడం, ఇరుకైన మెట్లు, వెంటిలేషన్ లేకపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సుమారు 20 గంటల పాటు కొనసాగిన ఈ హైడ్రామాలో.. లోపల ఉన్నవారు ప్రాణాలతో బయటపడతారని కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూశారు. కానీ, ఆదివారం ఉదయం మంటలు అదుపులోకి వచ్చాక లోపలికి వెళ్లిన అధికారులకు విగతజీవులుగా మారిన మృతదేహాలు కనిపించాయి.  మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

కాగా ఈ ఘోర ప్రమాదంలో మరణించిన వారిలో పసివాళ్లు ఉండటం అత్యంత విషాదకరం. పొట్టకూటి కోసం వచ్చిన వారు, ఆడుకోవడానికి వచ్చిన పిల్లలు మంటల్లో మాడిమసైపోయా రు. మృతుల వివరాలను అధికారు లు అధికారికంగా వెల్లడించారు. బీ.బీ. అమ్మ (60) కర్ణాటకకు చెందిన ఈమె, ఆ భవనంలో పనిచేసే వాచ్మన్ సమీర్ తల్లి. వద్ధా ప్యంలో కుమారుడి వద్దకు వస్తే.. మత్యువు ఆమెను కబళించింది.

అఖిల్ (7) ప్రణీత్ (11) నాంపల్లికి చెందిన యాదయ్య కుమారులు. ఒకే కుటుంబానికి చెందిన ఈ ఇద్దరు చిన్నారులు అగ్నిప్రమాదంలో ప్రా ణాలు కోల్పోవడం ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. మొహమ్మద్ ఇంతియాజ్ (31) నాంపల్లి నివాసి.సయ్యద్ హబీబ్ (30) రాజేంద్రనగర్, శాస్త్రిపురానికి చెందిన ఆటో డ్రైవర్. ఉస్మానియా మార్చురీ వద్ద మతుల బంధువుల రోదనలు మిన్నంటాబయి.  

నగరవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్

నాంపల్లి బజార్ఘాట్లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదానికి గోదాములే ఈ విపత్తుకు అసలు కారణమని, సాధారణ నివాస భవనాన్ని అక్రమ గోదాముగా మార్చడం వల్లే అది డెత్ ట్రాప్ లా మారిందని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ సంచలన విషయాలు వెల్లడించారు. సోమవారం ఆయన ఘటనా స్థలిని పరిశీలిం చా రు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రమాద తీవ్రతకు గల కారణాలను విశ్లేషించారు.

నివాస ప్రాంతాల్లో ఇలాంటి మండే స్వభావం ఉన్న వస్తువులను నిల్వ చేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు.. భవ న యజమానిపై, అక్రమంగా సరుకులు నిల్వ చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమో దు చేయాలని పోలీసులకు సిఫార్సు చేశామన్నారు.   నగరవ్యాప్తంగా నివాస ప్రాంతాల్లో ఉన్న అక్రమ గోదాములను గుర్తించేందుకు త్వరలోనే స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. 

ఫర్నిచర్ షాపు యజమాని అరెస్ట్

హైదరాబాద్‌లోని నాంపల్లి ఫర్నీచర్ షాపులో అగ్ని ప్రమాదం సంభవించి ఐదు గురు మృతి చెందిన సంఘటనలో దుకాణం యజమాని సతీష్ బచాను ఆదివారం అబి డ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్దంగా, ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించకుండా సెల్లార్‌లో వ్యాపారం చేస్తుండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

రూ. 5 లక్షల సాయం

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ , సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ హరి చందనకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. ప్రాథమిక విచారణలో షాపు యజమాని నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

భవనం పూర్తిగా దెబ్బతింది. కూల్చివేతే శరణ్యం..

అగ్నిప్రమాద తీవ్రతకు భవనం పూర్తి గా దెబ్బతింది. పిల్లర్లు, స్లాబ్లు అధిక ఉష్ణోగ్రతకు బీటలు వారాయి. జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణుల బందం ఆదివారం భవనాన్ని క్షుణ్ణంగా పరిశీలిం చింది. కాంక్రీట్ పట్టు కోల్పోయిందని, భవనం ఏ క్షణమైనా కూలిపోయే ప్రమా దం ఉందని నిపుణులు తేల్చిచెప్పారు. దీంతో భవనాన్ని కూల్చివేయడం మిన హా మరో మార్గం లేదని అధికారులు నిర్ధారణకు వచ్చారు.

చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరలోనే కూల్చివేత ప్రక్రియను ప్రారంభించనున్నారు. హైడ్రా పేరుతో చెరువుల ఆక్రమ ణలపై దష్టి సారించిన ప్రభుత్వం.. జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాల్లోని ఇలాంటి మత్యు భవనాలపై ఎప్పుడు చర్యలు తీసుకుంటుందో అని నగర పౌరులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి, కఠిన చర్యలు తీసుకోకపోతే.. రేపు మరొక ప్రాంతం మత్యువాత పడక తప్పదని హెచ్చరిస్తున్నారు.