calender_icon.png 26 January, 2026 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకటన

26-01-2026 01:12:20 AM

వచన కవితా పోటీలకు ఆహ్వానం 

‘వెన్నెల సాహితీ పురస్కారం-2025’ కవితా పోటీలకు దరఖాసులు ఆహ్వానిస్తున్నట్లు వెన్నెల సాహితీ సంగమం ప్రధాన కార్యదర్శి పర్కపెల్లి యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25లో ప్రచురించిన నాలుగు కవితా సంపుటాలను ఫిబ్రవరి 28వ తేదీలోపు పర్కపెల్లి యాదగిరి, ఇం.నెం.17-3-86/35, జ్యోతి నిలయం, వినాయక్ నగర్ రోడ్-2, రంగధాంపల్లి చౌరస్తా దగ్గర, సిద్ధిపేట, 502103, సెల్ నంబర్ 92999 09516, 98482 61284 పంపించాలని కోరారు. విజేతలకు సిద్దిపేటలో జరుగే సాహిత్య కార్యక్రమంలో నగదు, పురస్కారం అందజేయనున్నట్లు తెలిపారు.  

పాలమూరు సాహితీ అవార్డు పోటీలకు..

పాలమూరు సాహితీ అవార్డు-2025కు తెలుగు సాహిత్యంలో ఉత్తమ వచన కవితా పోటీలకు దరఖాస్తులు కోరుతున్నట్లు ఆ సాహితీ వ్యవస్థాపకులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పురస్కారం కోసం 2025 సంవత్సరంలో ముద్రితమైన వచన కవితా  సంపుటాలను మాత్రమే మూడేసి ప్రతులను పంపించాల్సిందిగా కోరారు. కవులు తమ ప్రతులను డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, (9032844017)  ఇం.నం. 8-5-38, టీచర్స్ కాలనీ, మహబూబ్ నగర్ - 509001, తెలంగాణ రాష్ట్రం అనే చిరునామాకు జనవరి 31 లోపు పంపాలని ఆయన  కోరారు. బహుమతి పొందిన ఉత్తమ వచన కవితా సంపుటికి  రూ.5,116/- నగదు బహుమతితో పాటు జ్ఞాపికను అందజేస్తారని పేర్కొన్నారు.  

కళింగాంధ్ర కథా సంకలనానికి..

కళింగాంధ్ర జీవన ఆకాంక్షలను, భావోద్వేగాలను, ఆలోచన సరళిని, ప్రాపంచిక దృక్పథాన్ని ఒడిసి పట్టుకునే ప్రయత్నమే ఈ ‘కళింగాంధ్ర కథ 2025’. ఈ సంకలనానికి ప్రముఖ కళింగాంధ్ర కథకులు అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరునాయుడు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. 2025వ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబరు వరకు వివిధ మాధ్యమాల్లో ప్రచురితమైన వాటిలో నచ్చిన కథను  sikkolubooks@gmail.com మెయిల్ లేదా 99892 65444 నంబరుకు వాట్సప్ ద్వారా సూచించగలరు. ఈ వార్షిక కథా సంకలనంతో పాటు కళింగాంధ్ర కథకుల డెరక్టరీ ప్రచురితమవుతుంది. వర్తమాన కళింగాంధ్ర కథకులు తమ పేరు, ఫోన్ నంబర్లను నమోదు చేసుకోవలసిందిగా కళింగాంధ్ర కథ 2025 విజ్ఞప్తి చేసింది.