04-10-2025 07:37:41 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ సెక్రెటరీ రవీందర్ జన్మదిన వేడుకలను వరంగల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మజ్దూర్ యూనియన్ లో కార్యవర్గ సభ్యుని మొదలై సికింద్రాబాద్ డివిజనల్ సెక్రెటరీగా నిస్వార్థంగా నిర్వీరామంగా సేవలందిస్తున్న రవీందర్ నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. మజ్దూర్ యూనియన్ వరంగల్ బ్రాంచ్ సెక్రెటరీ యుగంధర్ యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు కలిసి పూలమాల శాలువాతో సత్కారం చేసి శుభాకాంక్షలు తెలియజేసారు. కార్మికులకు మరిన్ని ఉత్తమ సేవలు అందించాలని అకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ వరంగల్ బ్రాంచ్ చైర్మన్ ముకుందం, వైస్ చైర్మన్ సుధాకర్ అసిస్టెంట్ సెక్రెటరీ సురేష్, రాజేష్ యూత్ లీడర్ రాజేష్, సిసిఎస్ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్, ఎలక్ట్రీకల్ బ్రాంచ్ సెక్రెటరీ సదానందం, కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.