04-10-2025 07:34:47 PM
చిట్యాల,(విజయక్రాంతి): తమతో కలిసి చదువుకున్న స్నేహితురాలి ఆర్థిక పరిస్థితులు తెలుసుకున్న స్నేహితులు స్పందించి శనివారం ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచారు. చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామానికి చెందిన పాలకూరి సైదమ్మ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2000-01 లో పదవ తరగతి పూర్తి చేసింది. దసరా పండుగ సందర్భంగా పూర్వ విద్యార్థులు అంతా కలిసి తమ తోటి కలిసి చదువుకున్న సైదమ్మ ఆర్థిక పరిస్థితి స్థితిగతులు సరిగా లేవని తెలుసుకొని ఆమెకు అండగా నిలవాలని ఉద్దేశంతో 50 వేల రూపాయలు పోగు చేసి ఆమె కూతురి పేరు మీద బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేశారు. భవిష్యత్తులో ఎలాంటి కష్టం వచ్చినా, అవసరం వచ్చిన ఒకరికొకరం సహాయ సహకారాలు అందించుకోవాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ పూనారు.