16-09-2025 05:18:27 PM
హైదరాబాద్: మాజీ సీఎస్ ఎస్.కే.జోషి(SK Joshi)కి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని మంగళవారం హైకోర్టు ఆదేశించింది. సాక్షిగా మాత్రమే తన వాంగ్మూలం తీసుకున్నారని, పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో ఎస్.కే.జోషి పిటిషన్ వేసిన విషయం తెలిపిందే. పీసీ ఘోష్ కమిషన్ తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని.. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తనపై చర్యలు చేపట్టొద్దని ఎస్.కే.జోషి కోరారు. తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.